10 వరకూ దరఖాస్తులకు అవకాశం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పేద విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపునకు సంబంధించి దరఖాస్తులకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 2023 –24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు, అనాథలు, హెచ్‌ఐవీ బాధితలు, వికలాంగులు, బలహీన వర్గాలు, షెడ్యూలు కులాలు, షెడ్యూల్‌ తెగల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. వీటి భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్‌ఈ.ఏపీ.గవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో సమాచార బులెటిన్‌ను ఉచితంగా డౌన్‌్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. దరఖాస్తులను వచ్చేనెల 10వ తేదీలోగా వెబ్‌సైట్‌లో సమర్పించాలన్నారు. అడ్మిషన్‌ సమయంలో, ఆ తర్వాత సమస్యలను పరిష్కరించడానికి టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 14417ను సంప్రదించాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 22 నుంచి వచ్చేనెల 10 వరకు జరుగుతుందన్నారు. డేటా ద్వారా విద్యార్థి దరఖాస్తు అర్హత నిర్ధారణ వచ్చేనెల 13 నుంచి 17 వరకు, మొదటి లాటరీ తేదీ 18న, తిరిగి ఫలితాలు, విద్యార్థి అడ్మిషన్‌ కన్ఫర్మేషన్‌ 19 నుంచి 25వ తేదీ వరకు, రెండో లాటరీ 29న, తిరిగి ఫలితాలు, కన్పర్మేషన్‌ మే 1 నుంచి 5వ తేదీ వరకు జరుగుతాయన్నారు. హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తాయన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయం జూనియర్‌ అసిస్టెంట్‌ ఎంఎస్‌ఎన్‌.రాజును 99599 59346 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

ప్రశాంతంగా ఆర్డీ

కార్యాలయంలో కౌన్సెలింగ్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జోన్‌ 1,2 పరిధిలో వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టిన ప్రమోషన్‌ కౌన్సెలింగ్‌ పక్రియ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోనున్న హెల్త్‌ అసిస్టెంట్‌లకు హెల్త్‌ సూపర్‌వైజర్లుగా ప్రమోషన్‌ ఇస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ పద్మ శశిధర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. దీనిపై గురువారం రెండు యూనియన్ల మధ్య జరిగిన వివాదం చెలరేగడంతో కౌన్సెలింగ్‌ పక్రియ వాయిదాపడిన సంగతి తెలిసిందే. డైరెక్టర్‌క్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆదేశాలతో శుక్రవారం తిరిగి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top