అమలాపురం టౌన్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసినప్పుడల్లా తొక్కిసలాట తదితర కారణాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ విమర్శించారు. ఆయన అమలాపురంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆలయానికి భక్తులు పోటెత్తినా ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే భక్తులు మృతి చెందడం, పలువురు గాయపడడం జరిగిందన్నారు. ఆ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆరుగురు, సింహాచలంలో నలుగురు, రాజమహేంద్రవరంలో గత పుష్కరాలకు దాదాపు 30 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ సంఘటలన్నీ చంద్రబాబు ప్రభుత్వ భద్రతా వైఫల్యంతోనే జరిగాయని ఆరోపించారు.
బాల బాలాజీకి
రూ.4.07 లక్షల ఆదాయం
మామిడికుదురు: కార్తిక శుద్ధ ఏకాదశి సందర్భంగా అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. పవిత్ర వైనతేయ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు మాట్లాడుతూ స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4.07 లక్షల ఆదాయం వచ్చిందని, స్వామివా రి నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.94,996 విరాళాలుగా అందించారన్నారు. ఆరు వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారని, 3,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. అమలాపురానికి చెందిన బొంతు వెంకట సుబ్బారావు, మంగాదేవి దంపతులు నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.11,111, పొదలాడకు చెందిన ఉండ్రు మంగాదేవి రూ.10,116 విరాళంగా అందించారన్నారు. దాతలకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేసినట్టు తెలిపారు.
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం
రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
కొత్తపేట: వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు నియమితులయ్యారు. వివిధ విభాగాలకు సంబంధించి పార్టీ అధిష్టానం ఇప్పటికే అనేక మంది నాయకులకు పదవులు ప్రకటించింది. తాజాగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఎంతో నమ్మకంతో తనను బీసీ రాష్ట్ర కమిటీలో నియమించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని అన్నారు.
మృతుల కుటుంబాలకు
ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
అల్లవరం: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై మాజీ ఎంపీ, సీఈసీ సభ్యులు చింతా అనురాధ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా, ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో చోట ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నా యన్నారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామి ఆలయానికి శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు పోటెత్తారు. సుమారు 28 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,69,700, అన్నదాన విరాళాలు రూ.1,09,339, కేశఖండన ద్వారా రూ.6,480, తులాభారం ద్వారా రూ.600, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.26,665 కలిపి మొత్తం రూ.4,12,774 ఆదాయం వచ్చిందని వివరించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే భక్తుల మృతి


