ముగిసిన అధ్యయనోత్సవాలు

ఆలయ ఆవరణలో వేద పారాయణ చేస్తున్న పండితులు   - Sakshi

ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అధ్యయనోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఉగాది పర్వదినం కావడంతో ఆలయం భక్తులతో కిటికిటలాడింది. ద్రవిడ పారాయణం, దివ్య ప్రబంధనం, తదితర కార్యక్రమాలను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి గరుడ, సింహ వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు. పండితులు చతుర్వేద పారాయణ నిర్వహించారు. అధ్యయనోత్సవాల గురించి భక్తులకు వేద పండితులు వివరించారు. అనంతరం ఆళ్వారుల ప్రసాద వినియోగం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ నెల 31 నుంచి జరిగే స్వామి వారి కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు.




 

Read also in:
Back to Top