వాడపల్లిలో ఆధ్యాత్మిక శోభ

అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్న వేద పండితులు  - Sakshi

కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

ఆత్రేయపురం: శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలతో వాడపల్లి సోమవారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ద్రవిడ పారాయణ, దివ్య ప్రబంధ పఠనం తదితర కార్యక్రమాలను పండితులు వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి ఉదయం పల్లకిపై, సాయంత్రం సింహ వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు చతుర్వేద పారాయణ నిర్వహించారు. అధ్యయనోత్సవాల గురించి భక్తులకు వివరించారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆశయాన్ని సఫలం చేసేందుకు ఆళ్వార్లు భగవంతునితో తమ అనుభవాన్ని ‘తిరువాయ్‌మొళై’గా అనుగ్రహించారని చెప్పారు. ‘వాయెమొ’ అంటే తమిళంలో వేదం అని అర్థమని, ‘తిరువాయ్‌మొ’ అంటే ‘కరుణ కలిగిన వేదం’ అని పండితులు వివరించారు. అనంతరం ఆళ్వారుల ప్రసాద వినియోగం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యాన కమిటీ సభ్యులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.

u

పట్టుబడి గంజాయి, నిందితులతో

తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎస్సై శివనాగబాబు




 

Read also in:
Back to Top