తగ్గడానికి కారణాలెన్నో..

ఫ చైనాతో పాటు మలేషియా, సింగపూర్‌ దేశాలకు జరిగే ఎగుమతుల్లో మూడొంతులు తగ్గాయి. ఇటీవల కరోనా ప్రభావం, ఆర్థిక మాంద్యంతో ఆర్డర్లు మందగించాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. అరకొరగా ఎగుమతి అవుతున్న పీచులో సింహభాగం తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఆక్రమించాయి. దీనితో స్థానిక పీచుకు డిమాండ్‌ తగ్గింది.

ఫ ఉమ్మడి జిల్లాలో తయారు చేసే పరుపులు, మ్యాట్‌లలో కొబ్బరి పీచు వాడకం తగ్గింది. దీని స్థానంలో చైనా నుంచి దిగుమతి అవుతున్న రిక్రాన్‌ (పీవీసీ వాడే ప్లాస్టిక్‌ నుంచి వచ్చే పీచు తరహా ఉత్పత్తి) వాడుతున్నారు. కాయర్‌ పీచు కొంతకాలానికి బలపడుతోంది. అదే రిక్రాన్‌ ఎంతకాలమైనా మెత్తగానే ఉంటుంది. పైగా బరువు తక్కువ. కొబ్బరి పీచుతో తయారు చేసే పరుపు బరువు 19 కిలోలు ఉంటే.. రిక్రాన్‌తో తయారయ్యే పరుపు 14 కిలోలు ఉంటుంది. తేలిక పరుపులు కావడంతో వినియోగదారులు వీటికే మొగ్గు చూపుతున్నారు.

ఫ పెద్ద నగరాలు, పట్టణాలు.. చివరకు గ్రామాల్లో సైతం భవన నిర్మాణాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శ్లాబ్‌లు వేసేందుకు సెంట్రింగ్‌, పరంజీల నిర్మాణాలకు ఐరెన్‌ వినియోగిస్తున్నారు. దీనివల్ల డొక్క పీచుతో తయారు చేసే తాళ్ల వాడకం తగ్గింది. దీనివల్ల రూ.3 ఉండే తాడుకు ఇప్పుడు రూ.1.40 కూడా రావడం లేదు.




 

Read also in:
Back to Top