ప్రభుత్వ ప్రోత్సాహంతో చదువు

- - Sakshi

జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో చదువు ఆటంకం లేకుండా సాగుతుంది. డిగ్రీ తొలి ఏడాదిలో మూడు పర్యాయాలు విద్యా దీవెన ద్వారా రూ.18 వేలు అందుకున్నాను. నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఈ సొమ్ము ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు.

–పెచ్చెట్టి చైతన్య సద్గురుసాయి, బీఎస్సీ, దేవగుప్తం, అల్లవరం మండలం

ఒత్తిడి లేకుండా విద్య

నేను బీవీసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాను. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుంది. దీనివల్ల ఒత్తిడి లేకుండా ఉన్నత చదువులు చదువుకుంటున్నాను.

–పెదిరెడ్డి మాధవి నాగదుర్గాలక్ష్మి,

గాడిలంక, ముమ్మిడివరం మండలం

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం

మా కుటుంబంపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా జగనన్న విద్యా దీవెన పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. ఏటా క్రమం తప్పకుండా విద్యా దీవెన సొమ్ము పొందుతున్నాను. ఈ విషయంలో సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను. పేద కుటుంబాలకు విద్యా దీవెన ఓ వరం.

–చౌటుపల్లి వీర వెంకట సూర్యమణికంఠ,

కూర్మాపురం, రాయవరం మండలం




 

Read also in:
Back to Top