‘హాయ్‌..! మరదలా..’ అంటూ నగ్న చిత్రాలు, బూతు బావ భరతం పట్టిన మరదలు

Woman Approached Police After Brother In Law sent Her Obscene Photos - Sakshi

మరదలితో బావ అంటే సరదా నవ్విస్తూ.. చిలిపిగా ఆట పట్టిస్తూ ఉండొచ్చు! కానీ, ఇక్కడో ప్రబుద్ధుడు మరదలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మొబైల్‌లో న‌గ్న చిత్రాలు, అస‌భ్య మెసేజ్‌లు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో బావ. తన బావ వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అహ్మ‌దాబాద్‌లోని జుహ‌ర‌పురలో చోటుచేసుకుంది.

నిందితుడైన బావ త‌రచూ త‌న కోరిక తీర్చాల‌ంటూ.. ఫోన్‌లో న‌గ్న‌చిత్రాలు, అశ్లీల మెసేజ్‌లు పంపుతున్నాడ‌ని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2020 ఆగ‌స్ట్‌లో జ‌రిగిన తన( బాధితురాలు) వివాహానికి.. అక్కా, బావ‌ల‌ను పిల‌వ‌లేదు. కుటుంబ కలహాలు మనసులో పెట్టుకొని.. అప్ప‌టి నుంచే ఆ బావ వేధింపులు మొద‌లైనట్లు బాధితురాలు తెలిపింది.

త‌న కోరిక తీర్చాల‌ని లేదంటే.. మార్ఫింగ్ చేసిన న్యూడ్‌ ఫోటోలు, అసభ్యకరమైన సందేశాలను తన(మహిళ) భ‌ర్త‌కు పంపుతాన‌ని బెదిరించాడ‌ని ఆమె పేర్కొంది. బావ చేసే పని బయటపడితే.. తన కుటుంబ పరువుపోతుందని, తన భర్తకు ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తాడనే భయంతో బావ వేధింపులను భరిస్తూవచ్చింది. కానీ, రోజురోజుకు బావ అరాచకం పెరగటంతో.. లైంగిక వేధింపులు తాళలేక వెజాల్పూర్ పోలీస్ స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బూతు బావను కటకటాల వెనక్కి నెట్టి.. బడిత పూజ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top