యువతిపై స్పా యజమాని దాడి.. రోడ్డుపై జుట్టు లాగి, దుస్తులు చింపి | Ahmedabad Spa Manager Assaults Woman Drags Her By Hair; CCTV Video Viral - Sakshi
Sakshi News home page

Video: యువతిపై స్పా యజమాని దాడి.. రోడ్డుపై జుట్టు లాగి, దుస్తులు చింపి

Published Thu, Sep 28 2023 10:42 AM

Video: Ahmedabad Spa manager Assaults Woman Drags Her By Hair - Sakshi

నడిరోడ్డుపై ఓ యువతి పట్ల స్పా నిర్వాహకుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె జుట్టుపట్టకొని లాగి దాడి చేశాడు. యువతి దుస్తులు చింపుతూ, చెంపదెబ్బలుకొడుతూ వేధింపులకు గురిచేశాడు. స్థానికంగా ఉన్న ఒకరిద్దరు ఈ తతంగాన్నంతా చూస్తూ ఉండిపోయారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ దారుణ ఘటన సెప్టెంబర్‌ 25న జరగ్గా.. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

వివరాలు.. అహ్మదాబాద్‌కు చెందిన గాలక్సీ స్పా యజమాని మొహ్సిన్ తన షాప్‌ ముందు బిజినెస్‌ పార్టనర్‌ అయిన 24 ఏళ్ల యువతిపై దాడి చేశాడు. లోని స్పా ఎదుట యువతితో యాజమానికి గొడవకు దిగాడు. ఈ వీడియోలో రాత్రిపూట నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై మొహ్సిన్ యువతిపై పదేపదే దాడి చేయడం కనిపిస్తోంది. ఆమె వెంటపడుతూ తన దుస్తులు చింపేందుకు యత్నించాడు. అతడిని అడ్డుకునేందుకు యువతి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. అంతేగాక యువతి చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని లాక్కొచ్చాడు.

దాదాపు నాలుగు నిమిషాల పాటు ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశాడు. అక్కడున్న ఇద్దరు వ్యక్తు లుకూడా అతనికే మద్దతిస్తూ.. ఆమెను కాపాడటం మానేసి అలాగే ఉండిపోయారు.  చివరికి ఓ సామాజిక కార్యకర్త ద్వారా సమాచారం అందుకున్న బోడక్‌దేవ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతిని రక్షించారు. తరువాత ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించేశారు. అయితే అప్పటికే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. 
చదవండి: డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

ఈ ఘటన జరిగిన రెండు రోజుల దాకా యువతి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తరువాత ప్టెంబర్‌ 27న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో సదరు బాధితురాలు స్పా బిజినెస్‌లో మోహ్సిన్‌ భాగస్వామిగా తేలింది. వ్యాపారంలో భాగంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది హింసాత్మకంగా మారినట్లు పోలీసులు గుర్తించారు. 

నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కాగా దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వగా ఈ వీడియోలో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  కారణమేమైనా మహిళపై అంత దారుణంగా దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement