Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ చంద్రశేకర్ తెలిపిన వివరాల ప్రకారం... బాలాజీనగర్‌లోని శివాజీనగర్‌లో రహస్యంగా ఓ ఇంటిలో ఆరుగురు సభ్యులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడులు నిర్వహించి 6 గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులు బాకాపురం ప్రసాద్ (32), బాకాపురం జ్యోతి (35), వానరుల సాయికిషోర్ (25), ఎస్.దవర్లాల్ (30), వానరుల భవాణి (40) కుప్ప బాగ్యలక్ష్మి (30)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: (ప్రియుడితో ప్రేమ వివాహం.. మూడు నెలల ముచ్చట తీరకుండానే..!)