భర్త బయటకు వెళ్లడం చూసి.. మహిళపై సామూహిక లైంగిక దాడి

Kerala: Men Gang Rape Woman And Insert Beer Bottles In Her Private Parts Palani - Sakshi

తిరువనంతపురం: భర్త లేని సమయం చూసి ఒంటరి మ‌హిళ‌పై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణం త‌మిళ‌నాడులో చోటుచేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ కరువైందనే మాట తాజా సంఘటన ద్వారా మరో సారి రుజువైంది. బాధితురాల తెలిపిన వివరాల ప్రకారం.. త‌మిళ‌నాడురాష్ట్రంలోని దిండిగ‌ల్ జిల్లా ప‌ళ‌నిలో తీర్థయాత్రలకని తన భర్తతో వెళ్లింది.

ఈ క్రమంలో వారు ఓ లాడ్జిలో బస చేశారు. తన భర్త ఆహారం కోసమని బయటకు వెళ్లగా..  అది గమనించిన కొందరు వ్యక్తులు లాడ్జ్ మేనేజర్‌తో సహా తనపై సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారని వాపోయింది. అనంతరం తన ప్రైవేట్ భాగాలలో బీర్ బాటిళ్లతో గాయపరిచినట్లు తెలిపింది. ఈ ఘటన జరిగిన కాసేపటికి తన భర్త తిరిగి లాడ్జికి చేరుకోగానే నిందితులు ఆయ‌న‌పై దాడి చేసినట్లు తెలపింది. జూన్ 20న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కాగా ఆ ప్రాంత పోలీసులు బాధితురాలి ఫిర్యాదును నిరాకరించినట్లు పేర్కొంది. ప్రస్తుతం బాధితురాలు పరియారంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తలాస్సరి డీఎస్సీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top