Hyderabad: నగ్నంగా వీడియో తీసి.. ఇంటి నుంచి గెంటేసి..

Hyderabad: Women Complain For Taking Obscene Videos And Blackmail - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: తన నగ్న దృశ్యాలను వీడియో తీయడమే కాకుండా తన బంగారు బ్రాస్‌లైట్, ఉంగరం, రూ. 10 వేల నగదును బలవంతంగా తీసుకొని తన పర్సనల్‌ వీడియోను బహిర్గతం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ పఠాన్‌కోట్‌కు చెందిన నీరూశర్మ అలియాస్‌ దుర్గ(42) బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్‌కు చెందిన నీరూ శర్మకు స్నాచ్‌చాట్‌ ద్వారా యూసుఫ్‌గూడలో నివసించే భావనతో పరిచయం ఏర్పడింది. గత నెల 22వ తేదీన నీరూశర్మ తన కూతురితో కలిసి ఇక్కడికి వచ్చి భావన ఇంట్లో మకాం పెట్టింది.

అయితే ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో భావన స్నేహితురాలు పూనం వచ్చి అకారణంగా తనను తిట్టడమే కాకుండా దుర్భాషలాడారని ఆరోపించింది. పూనం తన బట్టలు విప్పేసి కొట్టి వీడియోలు కూడా తీసుకున్నదని తనకు గాయాలు అయ్యాయని తన కూతురు సమక్షంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. వారం తర్వాత భావన వచ్చి తన సామాన్లు బయటపడేసిందని దీంతో కూతురితో కలిసి తాను రోడ్డెక్కాల్సి వచ్చిందని ఆరోపించింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భావన, పూనం, సోనూ, మోనులపై ఐపీసీ సెక్షన 354, 354(సి), 323, 380 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: బెడ్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top