‘గే అంటూ వేధిస్తున్నారు.. పనికి కూడా రానివ్వడం లేదు’

Hyd: Being Harassed As Gay  Not Even Coming To Work  - Sakshi

‘గే’ అంటూ హేళన 

పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

సాక్షి, బంజారాహిల్స్‌: తనను ‘గే’ అంటూ కొందరు హేళన చేస్తున్నారని ఓ వ్యక్తి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నందలూరు గ్రామానికి చెందిన జూపూడి ఏసు బాబు అలియాస్‌ కుమార్‌ గత కొంత కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటూ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సెట్‌ వర్కర్‌గా పని చేస్తున్నాడు. వ్యక్తిగతంగా అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అయిన ఇతడు ఆయనలాగే వెండితెర మీద వెలిగిపోవాలని గత కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు యాక్టర్‌ అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయగా విఫలమయ్యాయి.

కానీ సినీ ఇండస్ట్రీ సెట్‌ వర్కర్‌గా పని దొరికింది. ఆ పని చేసుకుంటూ ఓ యూట్యూబ్‌ చానల్‌లో ఫ్రాంక్‌ వీడియోలు చేస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలో యూట్యూబ్‌ చానల్‌ ‘గే’గా నటించాడు. అప్పటి నుంచి పని చేస్తున్న సెట్‌లో అందరూ అతడిని ‘గే’ అంటూ మానసికంగా వేధిస్తున్నారని, కొద్ది కాలంగా పనికి కూడా రానివ్వడం లేదని పేర్కొన్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డానని, దీనికి కారణమైన వారందరి మీద చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు జూపూడి ఏసు బాబు ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: పెద్దనాన్న అఘాయిత్యం, గర్భం దాల్చిన బాలిక 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top