సుమోటోగా ‘మైనర్’ కేసు

సాక్షి, ఖమ్మం: జిల్లాలో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారయత్నం, హత్యాయత్నం సంఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. వివిధ పత్రికల్లో, ప్రసార సాధనాల్లో వచ్చిన కథనాల ఆధారంగా కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌ను మానవ హక్కుల కమిషన్ మంగళవారం ఆదేశించింది. బాధిత బాలికకు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం లేకుండా చికిత్స ఎలా చేస్తారని, కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించింది. బాలిక ఆస్పత్రిలో చేరిన సమయంలో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా చికిత్స ప్రారంభించడం ఆస్పత్రి తప్పిదంగా భావించి ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే నెల 6వ తేదీలోగా సంఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కోరింది. కేసును నవంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. చదవండి: (ఖమ్మంలో అమానుషం)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి