హేమంత్‌ హత్య: కీలక విషయాలు వెల్లడి

Hemanth Murder Case: Accuses Piolice Custody Trial Is Over - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు యుగేంధర్ రెడ్డి, లక్ష్మారెడ్డిని పోలీసులు ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు విచారణలో భాగంగా అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, యుగేంధర్ రెడ్డిలను విడివిడిగా విచారణ చేశారు. పోలీసులు విచారణలో నిందితులు కీలక విషయాలు వెల్లడించారు. హేమంత్, అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశామని అయినా తమని కాదని పెళ్లి చేసుకోవడంతో హేమంత్‌పై పగతో రగిలిపోయినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి విచారణలో వెల్లడించాడు. ఇక ఈ కేసులో హేమంత్ హత్యకు దారి తీసిన పరిణామాలు, పది లక్షల సుపారీ వ్యవహారంపై విచారణ చేశారు. కస్టడీ ముగియడంతో లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిని ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: అందుకే హేమంత్‌ని చంపేశాం: లక్ష్మారెడ్డి

పోలీసుల విచారణలో అవంతి పెళ్లి తరువాత కాలనీలో తల ఎత్తుకొని తిరగలేకపోయామని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గత 15 ఏళ్లుగా బామ్మర్ది యుగేంధర్‌తో తనకు సంబంధాలు కానీ, మాటలు కానీ  లేవని హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నాడు.  ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం తమదని, తాము ఉంటున్న కాలనీలో తమ కుటుంబానిదే ఆధిపత్యం ఉంటుందన్నారు. దీంతో అవంతి ప్రేమ విషయంతో కాలనీలో ఒకరికి ఒకరు చర్చించుకుంటుంటే తలదించుకోవాల్సి వచ్చిందని లక్ష్మారెడ్డి విచారణలో తెలిపారు. కస్టడీలో నిందితులు ఇద్దరినీ నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు.  అవంతికి హామీ ఇచ్చిన సీపీ సజ్జనార్‌

కేవలం తను డబ్బులు మాత్రమే సమకూర్చానని, మిగిలినదంతా తన బావమరిది యుగంధర్ రెడ్డినే చూసుకున్నాడని లక్ష్మారెడ్డి చెప్పినట్లు సమాచారం. అలాగే మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవంతి రెడ్డి సొంత తమ్ముడు ఆశిష్ రెడ్డి పాత్ర పైకూడా విచారణ చేశారు. ఈ కేసులో ఆశిష్ రెడ్డి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. త్వరలోనే ఇతర నిందితులను సైతం కస్టడికి తీసుకోని పోలీసులు విచారించనున్నారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారంతో  పరారీలో ఉన్న మరో నలుగురు నిందితులను పోలుసులు అరెస్ట్ చేశారు. నన్ను చంపినా బావుండేది..!

నలుగురు నిందితులు అరెస్ట్‌
హేమంత్‌ హత్యకు మొదట ఒప్పందం చేసుకున్న సుఫారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.లక్ష అడ్వాన్స్‌ తీసుకున్నట్లు తేలింది. డబ్బులు అందగానే ఫోన్‌ ఆఫ్‌ చేయడంతో, అవంతి మేనమామ యుగేంధర్‌ బిచ్చు గ్యాంగ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్‌ చేయగా వీరితో కలిసి 18ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై గతంలోనూ క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అవంతి, హేమంత్ పెళ్లి తర్వాత వారిని అవంతి తల్లిదండ్రులు గచ్చిబౌలిలో చాలాసార్లు కలిసినట్లు తెలిపారు. ప్రేమపెళ్లి లక్ష్మారెడ్డికి నచ్చలేకపోవడంతో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి హేమంత్‌ను చంపాలని కుట్ర చేశారన్నారు. ఆ తర్వాత అవంతకి మరో పెళ్లి చేయాలనుకున్నట్లు లక్ష్మారెడ్డి విచారణలో తెలిపాడు. కస్టడీ విచారణ అంశాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.

అసభ్య ప్రవర్తన, ట్యూషన్‌ టీచర్‌ అరెస్ట్‌
కూకట్‌పల్లిలోని ట్యూషన్‌ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సబ్జెక్ట్‌లో సందేహాలను నివృత్తి చేస్తానంటూ విద్యార్థిని ఇంటికి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ట్యూషన్‌ టీచర్‌ను అరెస్ట్ చేసిన షీ టీమ్‌ నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top