హేమంత్ హత్య కేసు: తొలిరోజు విచారణ

సాక్షి, హైదరాబాద్: హేమంత్ హత్య కేసులో నిందితుల తొలిరోజు కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో హత్యకు గల కారణాలను నిందితులు వెల్లడించారు. అవంతి ప్రేమ విషయం తెలిసే కట్టడి చేశామని కుట్రదారు లక్ష్మారెడ్డి తెలిపారు. ‘మా నుంచి తప్పించుకుని హేమంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్నట్లు మాకు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. 15 ఏళ్లుగా బామ్మర్ది యుగేంధర్‌తో మాటలు లేవు. హేమంత్, అవంతి విషయంపై తిరిగి మాట్లాడాల్సి వచ్చింది. ప్రాణం కంటే పరువే ముఖ్యమని భావించే కుటుంబం మాది. మేము ఉంటున్న కాలనీలో మా కుటుంబానిదే ఆధిపత్యం. అవంతి ప్రేమ విషయంతో కాలనీలో తలదించుకోవాల్సి వచ్చింది’అని లక్ష్మారెడ్డి విచారణలో చెప్పినట్టు సమాచారం. (చదవండి: హేమంత్ ఇంటివద్ద 24 గంటల భద్రత)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి