ప్రేమజంట ఆత్మహత్య

Couple Eliminated Themselves By Hanging Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సత్తెనపల్లి వివేకానంద నగర్‌లో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను ప్రదీప్తి, కిరణ్‌గా గుర్తించారు. వివరాలు.. ఇంటర్‌ చదువుతున్న ప్రదీప్తి, తాపీ మేస్త్రి కిరణ్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లిచేసుకోవాలని భావించారు. అయితే పెద్దలు ఇందుకు నిరాకరించడంతో మనస్తాపం చెందారు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న ఈ జంట.. తదనంతర పరిణామాల భయంతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు హృదయవిదారకంగా విలపిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది.(చదవండి: వివాహేతర సంబంధం: మహిళ మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top