గుడి దొంగలు దొరికారు! 

Burglary at Santoshimata Temple Robbers Found - Sakshi

సంతోషిమాత ఆలయంలో అర్ధరాత్రి చోరీ

అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లిన దుండగులు

కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు

మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు

ఎల్బీనగర్‌ సీసీఎస్‌కు చిక్కిన గ్యాంగ్‌  21.5 తులాల నగలు రికవరీ

సాక్షి, హైదరాబాద్‌: గత ఏడాది డిసెంబర్‌ 3న ఎల్బీనగర్‌లోని సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు 21.5 తులాల ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో ‘దేవుడి ఆభరణాలకే రక్షణ లేదు.. ఇక మాకేం రక్షణ కల్పిస్తారంటూ’ పోలీస్‌లపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు మూడు విభాగాలతో కలిపి స్పెషల్‌ ఆపరేషన్‌ టీంను ఏర్పాటు చేశారు. 

అన్ని కోణాల్లో సాంకేతిక ఆధారాలను సేకరించి, నిందితులను పట్టుకున్నారు. గుంటూరు జిల్లా, ఆత్మకూర్‌ గ్రా మానికి చెందిన పొన్నూరి చిన్న సత్యానందం అలియాస్‌ సతీష్, గురజాలకు చెందిన గంధం సమ్మయ్య, తుమ్మలచెరువుకు చెందిన జంగాల ప్రసాద్,  నాగార్జున్‌సాగర్‌కు చెందిన ధరావత్‌ నవీన్‌లను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి అమ్మవారి నగలన్నీ స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌  వివరాలు వెల్లడించారు.  

u ఈ గుడి దొంగల ముఠా సభ్యులంతా జైలులో ఒక్కటయ్యారు. ప్రధాన సూత్రధారి సత్యానందంపై నాగార్జున్‌ సాగర్, మంగళగిరి, దోనకొండ పీఎస్‌లలో మొత్తం 37 కేసులున్నాయి. పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అదే సమయంలో డ్రగ్స్‌ కేసులో ధరావత్‌ నవీన్, అక్రమ మద్యం విక్రయం కేసులో గంధం సమ్మయ్య, రేప్‌ కేసులో జంగాల ప్రసాద్, మండ్ల నాగేందర్‌ అరెస్టై జైలుకు వెళ్లా రు. ఈ నేపథ్యంలో సత్యానందంతో వారికి పరిచయం ఏర్పడింది. తనతో చేతులు కలిపితే బెయిల్‌పై మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. బెయిల్‌పై బయటికొచ్చిన ఈ ఐదుగురు నిందితులు ముఠాగా ఏర్పడ్డారు.  

ఈ గ్యాంగ్‌పై ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రా ల్లో 10 కేసులున్నాయి. వీటిలో నాలుగు ఆలయం చో రీలు కాగా.. ఒకటి బ్యాంక్‌ లూఠీ, మూడు వాహన చో రీలు, రెండు నైట్‌ హెచ్‌బీ దొంగతనం కేసులున్నాయి. 

చోరీకి ముందుగా పథకం ప్రకారం కార్, బైక్‌ను చోరీ చేస్తారు. వాటి నంబర్‌ ప్లేట్లను తీసేసి... నకిలీవి తగిలిస్తారు. ఉదయం పూట ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలపై రెక్కీ నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి, ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లేవారు. ప్రధాన మార్గంలో వెళితే టోల్‌గేట్లు, పోలీసుల నిఘా ఉంటుందని.. శివారు ప్రాంతాల మీదుగా పారిపోయేవారు. 

శనివారం ఉదయం ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన సత్యానందం, సమ్మయ్య, ప్రసాద్, నవీన్‌లను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు మండ్ల నాగేందర్‌ పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 21.5 తు లాల బంగారం, కారు, రెండు బైక్‌లు, గ్యాస్, ఆక్సిజ న్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.19.40 లక్షలు ఉంటుందని సీపీ తెలిపారు. 

భారీ చోరీలకు పథకం.. 
సంతోషిమాత ఆలయంలో చోరీ తర్వాత నిందితులు ఏటీఎం సెంటర్లు, బ్యాంక్‌ క్యాష్‌ చెస్ట్, జువెల్లరీ షాప్‌లను చో రీ చేయాలని ప్లాన్‌ వేశారు. గుంటూరు, సాగర్‌లో కొన్ని సెంటర్లపై రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. చోరీకి అవసరమైన కట్టింగ్‌ మిషన్, గ్యాస్, ఆక్సిజన్‌ సిలిండర్లు తదితర సామగ్రిని సిద్ధం చేసుకునకనట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top