13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం

మధ్యప్రదేశ్లో దారుణ ఘటన
భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఉమరియాలో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికను రెండు పర్యాయాలు బంధించి 9 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జనవరి 4వ తేదీన మార్కెట్కు వెళ్లిన బాలికను కొందరు వ్యక్తులు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మరో ఆరుగురు తోడయ్యారు. అంతా కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి, 5వ తేదీన ఆమెను విడిచిపెట్టా రు. దీంతో బాధితురాలు ఈ ఘోరాన్ని ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.
11వ తేదీన మరో సారి ఆమెను ఎత్తుకుపోయి, ఐదుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరిలో ఇప్పటికే ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు ఉండటం గమనార్హం. బాలిక కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు 11వ తేదీన కొత్వాలీ ఠాణాలో ఫిర్యాదు చేశారు. చివరికి ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలితో కలిసి ఆమె తల్లి 14న మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐపీసీ 376, 366ఏతోపాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు సహా ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి