డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అన్ని స్థాయిల్లో అవినీతి జరిగింది. స్టోర్స్ కోటాలో టీచర్ పోస్టు రూ.15 లక్షలకు అమ్ముకున్నట్లు వీడియో లు వెలుగు చూశాయి. హైకోర్టు, గవర్నర్ సుమోటోగా తీసుకొని విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మా అధినేత జగన్‌మో హన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాధితులకు అండగా ఉంటాం. – తేజారెడ్డి, వైఎస్సార్ సీపీ
పూతలపట్టు నియోజకవర్గ యువత అధ్యక్షుడు
క్రిమినల్ కేసులు పెట్టాలి
డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్రీడా కోటా, రిజర్వేషరన్, కాల్‌లెటర్లలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక విచారణ జరపాలి. కోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేసి, బాధితులకు న్యాయం చేయాలి. ఉద్యోగాల నియమాకాలంటూ అన్యాయం చేస్తా రా? యువత తిరగబడుతున్నా పట్టించుకోరా..?
– కిషోర్‌కుమార్, జీడీనెల్లూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు


