వ్యవసాయ శాస్త్రవేత్తలు బిల్ మెలీసన్, మోసా నో స్ఫూర్తితోనే నేను సేద్యం ప్రారంభించాను. పాలేకర్ సేంద్రియ వ్యవసాయ తరగతులకు హాజరవుతుంటాను. ఈ క్రమంలోనే పలు రకాల కలప, పండ్ల మొక్కలను సాగు చేస్తున్నాను. కోళ్లు, గొర్రెలు, పావురాలను పెంచుతున్నా. ఒక దానికి రేటు లేకపోయినా మరో దానిపై ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సమగ్ర విధానాలకే మనుగడ ఉంటుంది. మా పొలంలో ప్రతి అడుగుకి రూ.10 ఆదా యం వచ్చేలా లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఆ మేరకు ప్రయోగాలకు వెరవకుండా సేద్యం చేస్తున్నాం. సాగుపై ఎవరికై నా సలహాలు కావాలంటే సంప్రదించవచ్చు.
– బాబు, రైతు గుడ్లనాయనపల్లి, కుప్పం మండలం


