సీనియర్లకు మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

సీనియర్లకు మొండిచేయి

Jun 7 2026 7:01 AM | Updated on Jun 7 2026 7:01 AM

జూనియర్ల కింద సీనియర్లు పనిచేయాల్సిన దుస్థితి సీఎం జిల్లాలో వింత ధోరణి రెగ్యులర్‌ తహసీల్దార్లు ఉన్నా... డిప్యూటీలకే పూర్తి బాధ్యతలు? కలెక్టరేట్‌ అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : జిల్లా రెవెన్యూ శాఖలో చేపట్టిన బదిలీలు, ఉద్యోగోన్నతుల పోస్టింగుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సాకుగా చూ పిస్తూ శుక్రవారం కలెక్టరేట్‌ అధికారులు జారీచేసిన ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సీనియారి టీని పక్కనపెట్టి జూనియర్లకు అయాచితంగా అందలం దక్కే లా చక్రం తిప్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన సీనియర్లకు మొండిచేయి ఎదురుకాగా, జూనియర్ల కింద సీనియర్లు తలవంచుకుని పనిచేయాల్సిన దుస్థితి సీఎం చంద్రబాబు జిల్లాలో దాపురించింది. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ లేదని రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది.

నిబంధనలు బేఖాతర్‌

ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో జిల్లాలో ఏ ఒక్క తహసీల్దార్‌ పోస్టు ఖాళీగా ఉండకూడదనే నిబంధనను తెరపైకి తెచ్చి న కలెక్టరేట్‌ అధికారులు పోస్టింగుల్లో పక్షపాత ధోరణి ప్రదర్శించారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో సుదీర్ఘ కాలంగా డిప్యూటీ తహసీల్డార్లుగా పనిచేస్తూ, ప్రమోషన్‌కు అన్ని అర్హత లు ఉన్న సీనియర్లను విస్మరించారనే వాదనలు వినిపిస్తున్నా యి. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

తీవ్ర గందరగోళం

అధికారులు గంటల వ్యవధిలోనే డబుల్‌ పోస్టింగులు ఇచ్చి తీవ్ర గందరగోళానికి తెరలేపారు. రమేష్‌ బాబు, రేఖ, షేక్‌ ఖాజావలి, కళ్యాణి, రామకృష్ణ, తనూజ తదితరులకు తొలుత ఒక చోట ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మళ్లీ వెంటనే అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ పేరుతో ఇతర ప్రాంతాలకు డెప్యుటేషన్‌ బదిలీ చేశారు. అలాగే కుప్పం నుంచి తహసీల్దార్‌ చిట్టిబాబును ఉన్నఫళంగా కలెక్టరేట్‌లో రిపోర్ట్‌ చేయమనడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.

వెల్లువెత్తుతున్న అసంతృప్తి

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ జారీ చేసిన తహసీల్దార్ల బదిలీ ల ఉత్తర్వులపై రెవెన్యూ శాఖలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అర్హత, సీనియారిటీ ఉన్న ఎంతో మందిని కాదని జూనియర్లకు కీలక స్థానాలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం రెవెన్యూ సంఘం నాయకులు సీఎంవో దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

తహసీల్దార్ల పోస్టింగ్స్‌లో గందరగోళం

రెగ్యులర్లు ఉన్నా...డిప్యూటీలకే అందలం

జిల్లాలోని పలు మండలాల్లో ఖాళీగా ఉన్న తహసీల్దార్‌ పోస్టుల భర్తీలో అధికారులు అనుసరించిన తీరు విడ్డూరంగా ఉంది. కీలక మండలాల్లో రెగ్యులర్‌ తహసీల్దార్లను కాదని డిప్యూటీ తహసీల్దార్లకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నగరి ఆర్డీవో కార్యాలయంలో డీటీగా ఉన్న మునిశైలజను విజయపురం తహసీల్దార్‌గా, కుప్పం డీటీ సూర్యప్రకాష్‌నాయక్‌ను వి.కోటకు, కుప్పం ఆర్డీవో ఆఫీస్‌ డీటీ రామ్మూర్తిని పెద్దపంజాణి తహసీల్దార్‌గా నియమించడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న తాము జూనియర్ల కింద పనిచేయాల్సిన దుస్థితి వచ్చిందని బాధితులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement