నట్టేట ముంచారు | - | Sakshi
Sakshi News home page

నట్టేట ముంచారు

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

అధికారంలోకి రాకముందు 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామన్నారు. అప్పటివరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే ఆ హామీలను పూర్తిగా బుట్టదాఖలు చేశారు. ప్రతిభతో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు సైతం ఈ డీఎస్సీలో తీవ్ర అన్యాయం జరిగింది. స్వలాభం కోసం ఇన్ని కుతంత్రాలు చేస్తారని ఎవరూ ఊహించలేదు.

– రూపేష్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, యువత విభాగం

ఉద్యోగాలను అమ్ముకున్నారు

మెరిట్‌ లిస్ట్‌ డేటాను సైతం మాయం చేసిన ఈ ప్రభుత్వం పై సీబీఐ విచారణ జరిపించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే లేనంతటి భారీ కుంభకోణం లోకేష్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఎన్నికల సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ అంటూ అదరగొట్టిన తండ్రీకొడుకులు.. ఇప్పుడు ప్రైవేటు రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనే విషయం పై శ్వేతపత్రం విడుదల చేయాలి.

– కిషోర్‌, రాష్ట్ర కార్యదర్శి, యువత విభాగం

Advertisement
 
Advertisement
Advertisement