అకాల వర్షాల వల్ల మామిడి కాయలు రాలిపోతున్నాయి. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా లేవు. కాయలు కోత కొచ్చే సరికి వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. సరైన ధరలు ఉండడంలేదు. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇప్పటి వరకు గుజ్జు ఫ్యాక్టరీలు బిల్లులు కూడా ఇవ్వలేదు. దీంతో రైతులు కుంగిపోతున్నారు.
– ఉమాపతినాయుడు, రైతు సంఘం నాయకుడు, చిత్తూరు
నష్టం తప్ప లాభం లేదు
మాకు 2.50 ఎకరాల్లో మామిడి సాగు ఉంది. ఏడాదికి సాగుకు అయ్యే ఖర్చు రూ.90 వేలు అవుతోంది. ఇదిపోను కాయలు కోతకొస్తే కోతకూలి అదనం. తీరా కాయలను మార్కెట్‌కు తీసుకువస్తే పెట్టిన పెట్టుబడి కూడా చేతికిరావడం లేదు. నష్టం తప్ప లాభం ఏమీలేదు. మామిడికి కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలి.
– గురుమూర్తి, మామిడి రైతు, చిత్తూరు మండలం
మామిడికి ధరలు లేవు
మామిడికి ఈ సారి కూడా ధరలు లేవు. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు కోసం కార్యాలయల చుట్టూ తిప్పించుకున్నారు. రూ.8 గిట్టుబాటు ధర అన్నారు. కేజీకి రూ.4 ఇచ్చారు. ఈ సారి కూడా దిగుబడి బాగుంది. కొనుగోలుపై అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి రైతులకు కష్టాలు లేకుండా చూడాలి.
– కన్నయ్యనాయుడు, ఏ.జంగాలపల్లి, చిత్తూరు మండలం


