రౖపెవేటీకరణపై అంకుశం
కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో భాగస్వాములు కావడంలో వైఎస్సార్‌సీపీ నేతలు సఫలీకృతం అయ్యారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు , ప్రజల నుంచి ఊహించని ఆదరణ లభించింది. దీంతో పార్టీ నేతలు ఉత్సాహంగా ఊరూ వాడ ఏకమై సంతకాల సేకరణ ఉద్యమంలా చేపడుతున్నారు.
బంగారుపాళెం : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ అన్నా రు. శనివారం బంగారుపాళెంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో సునీల్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించి ప్రజల మనస్సులో నిలిచిపోయాడన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు వ్య క్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తు తరాల కోసమే ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ పోరుబాట సాగిస్తోందన్నారు. అదే విధంగా మండలంలోని ఆండారెడ్డిపల్లె, తగ్గువారిపల్లెలో మాజీ సమితి అధ్యక్షుడు తులసీరామకృష్ణారెడ్డి ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, జిల్లా పార్టీ కార్యదర్శులు గోవిందరాజులు, రఘుపతిరాజు, కృష్ణమూర్తి, ప్రకాష్‌రెడ్డి, థామస్, కిషోర్‌కుమార్‌రెడ్డి, సర్దార్, వడ్డెర కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ మొగిలీశ్వర్, రెడ్డెప్ప, షాకీర్, మహేంద్ర, గజేంద్ర, జగదీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైద్య కాలేజీలను బినామీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్ర
పెద్దపంజాణి: వైద్య కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేదలకు తీవ్ర నష్టం కలుగుతుందని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. వారు శనివారం రాయలపేట, కొళత్తూరు, ముత్తుకూరు, పెద్దవెలగటూరు, పెద్దపంజాణి పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి పేదలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు పిల్లలు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారని తెలిపారు. వాటిని చంద్రబాబు ప్రైవేటీకరణ పేరుతో తమ వారికి ఇచ్చుకునేందుకు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమాలలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుహేబ్, మేధావుల ఫోరం మండల అధ్యక్షుడు గుర్నాథరెడ్డి, సర్పంచులు చంద్రశేఖర్, రవికుమార్, నాయకులు మార్కొండయ్య, రాజా, మంజునాథరెడ్డి, హనీఫ్ బాషా, రాజన్న, ముబారక్ పాల్గొన్నారు.
బైరెడ్డిపల్లెలో అనూహ్య స్పందన
బైరెడ్డిపల్లె : ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి బైరెడ్డిపల్లె క్రిష్ణమూర్తి అన్నారు. బైరెడ్డిపల్లెలో శనివారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లబించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వలన పేదలకు ఉచిత వైద్యం ఎలా అందుతుందని వారు ప్రశ్నించారు. దీన్ని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కార్తిక్, మండల యూత్ ప్రెసెడెంట్ మహేష్‌బాబు, వైస్సార్‌సీపీ నేతలు జయకుమార్‌రెడ్డి, తబ్రాజ్‌బాష, చంద్రశేఖర్, కుమార్, దినేష్ పాల్గొన్నారు.
రౖపెవేటీకరణపై అంకుశం


