అక్రమ కేసులతో అడ్డుకోలేరు
– కావడితో మొక్కులు తీర్చుకున్న కృపాలక్ష్మి
కార్వేటినగరం : కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నట్లు గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి అన్నారు. శనివారం కార్వేటినగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై గొంతునొక్కి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే అవినీతి, అక్రమాలను తమ పార్టీ నేతలకు అంటగట్టి ఏదో రకంగా జైలు పాలు చేయాలన్న కుట్రలు చేస్తున్నట్లు విమర్శించారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక అబాసుపాలు చేయాలన్న కక్షతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నిటికీ ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తోందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ కేసులో త్వరగా బెయిలు రావాలని సుబ్రమణ్య స్వామికి అప్పట్లోనే మొక్కుకున్నారు. ఇటీవల ఆయనకు బెయిల్ రావడంతో శనివారం పుత్తూరులోని కృపాలక్ష్మి నివాసంలో పుష్ప కావడిని ప్రత్యేకంగా అలంకరించి కార్వేటినగరం లోని శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీసుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆమె వెంట ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి(వెదురుకుప్పం), మణి (శ్రీరంగరాజపురం), రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి చందురాజు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రాధికారెడ్డి, స్థానిక సర్పంచ్ ధనంజయవర్మ, పట్నం ప్రభాకర్‌రెడ్డి, పురంధర్, ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు బట్టే సుబ్రమణ్యం, జనార్దన్, వెంకటరత్నం,మునిక్రిష్ణ, నందగోపాల్, ధనశేఖర్‌యాదవ్, పట్టాభిరెడ్డి,తులసి, మోహనకుమారి, శ్రీనివాసులురెడ్డి, మున్నా, రత్నంరెడ్డి, దాము, అంబిక, రుక్మిణి , నాగేంద్ర, సాయికుమార్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రామయ్య, జనార్ధన్, కాళప్ప, బూత్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజి, వైద్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కోలార్ ప్రకాష్, కో ఆప్షన్ సభ్యుడు వెంకటేశ్, మాజీ సర్పంచ్‌లు రమేష్‌రెడ్డి, పెద్దిరెడ్డి, గోవిందన్, బొజ్జారెడ్డి, మాజీ యువత మండల అధ్యక్షుడు నరేష్ రెడ్డి, ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు.


