జిల్లాలో 98,924 పెండింగ్ కేసులు
చిత్తూరు అర్బన్ : ‘‘ పూర్వపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 98,924 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇది గతనెలాఖరు నాటి సంఖ్య. పెండింగ్ కేసుల పరి ష్కారంపై సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు వరకు పర్యవేక్షిస్తోంది. కేసుల పరిష్కారంలో న్యాయమూ ర్తులు చొరవ చూపించాలి. ప్రతి కోర్టుకు నిర్దేశించిన కేసుల పరిష్కార లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిందే..’’ అంటూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. శనివారం చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులకు కేసుల పరిష్కారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులతో పోలిస్తే.. కొత్త కేసుల నమోదు సంఖ్య ఆశ్యర్యాన్ని కలిగిస్తోందన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో న్యాయవ్యవస్థ పనిచేస్తోందన్నారు. వయో వృద్ధులకు సంబంధించిన కేసులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా జడ్జిలు చొరవ చూపాలన్నారు.సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి రమేష్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, న్యాయమూర్తులు గురునాథం, రామ్‌గోపాల్, అర్చన, శ్రీదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 98,924 పెండింగ్ కేసులు


