పోలీసు గ్రీవెన్స్‌కు 31 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 31 వినతులు అందాయి. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు అందాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మాట్లాడారు. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతీ సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు.
క్వాంటమ్
కంప్యూటింగ్‌పై శిక్షణ
నారాయణవనం: స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఐదు రోజుల పాటు అధ్యాపకుల శిక్షణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు 40 మంది అ ధ్యాపకులు శిక్షణలో పాల్గొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాముఖ్యత, ప్రాథమిక సిద్ధాంతాలు, ఆధునిక పరిశోధనా ధోరణులు, అనువర్తనాలపై నిపుణులు అధ్యాపకులకు శిక్షణ అందించనున్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఫిజిక్స్ విభాగం అసో సియేట్ ప్రొఫెసర్లు రితీష్ కుమార్ అగర్వాల్(ఐఐటీ తిరుపతి) చిత్రాసేన్ జైనా(ఐఐఎస్‌ఈఆర్) మా ట్లాడుతూ సాంకేతిక రంగంలో వేగంగా విస్తరిస్తున్న క్వాంటమ్ టెక్నాలజీలపై అధ్యాపకులు అవగాహన పెంచుకోవాలన్నారు. సిలబస్‌లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభ్యాసాలను ప్రవేశపెట్టి, విద్యార్థులను నిష్టాతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతన సాంకేతికతపై పరిశోధనలు, శిక్షణ అధ్యాపకుల అక డమిక్ నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుస్తాయన్నారు. ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు, హెచ్‌ఓడీలు మల్లిక, మురళి, కుమార్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమబాల, ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ నాగరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు.
బాబు ప్రభుత్వంలో
బాదుడే బాదుడు
– లబోదిబోమంటున్న వినియోగదారులు
గుడిపాల: కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం మళ్లీ లబ్ధిదారులకు షాక్ ఇచ్చింది. అరియర్స్ పేరిట బాదుడే బాదుడుగా బిల్లులను దంచేస్తున్నారు. గుడిపాల మండలంలోని వసంతాపురంలో సో మవారం విద్యు త్ బిల్లులు ఇచ్చా రు. సర్వీసు నంబర్ 51133 06003748 గల ఇంటికి కరెంట్ బిల్లు మొత్తం రూ.1919 వచ్చింది. ఇందులో నెల బిల్లు రూ.912 కాగా, అరియర్స్ అమౌంట్ అని చెప్పి మరో రూ.1007 జత చేశారు. దీంతో మొత్తం బిల్లు రూ.1919 వచ్చింది. ఇంత బిల్లు రావడంతో ఆ లబ్ధిదారుడు ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే సంబంధిత ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్‌చేయగా ఆయన ఏ మాత్రం స్పందించలేదని ఆయన వాపోయాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బిల్లులు మీద బిల్లులు బాదుతుండడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 31 ఫిర్యాదులు
పోలీసు గ్రీవెన్స్‌కు 31 ఫిర్యాదులు


