మల్లిమడుగు గేట్లు ఎత్తివేత
రేణిగుంట: దిత్వా తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని మల్లిమడుగు రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. శుక్రవారం సాయంత్రం 9 గేట్లను రెండు అడుగుల ఎత్తు వరకు ఎత్తి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 2500 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌కు చేరుతుండగా దిగువకు 2200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మల్లిమడుగు రిజర్వాయర్ వద్ద నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితి ఆధారంగా రాత్రి వేళల్లో గేట్లు ఎత్తే వీలుంటుందని సుజల స్రవంతి ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


