మీరే చూపండి పరిష్కారం
కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు వేడుకోలు వివిధ సమస్యలపై 232 అర్జీల నమోదు అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయిలో న్యాయం జరగడం లేదు కలెక్టర్ సార్.. తమరే న్యాయం చేయాలంటూ అర్జీదారులు దండం పెట్టి వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పడాల్, డీఆర్‌ఓ మోహన్ కుమార్ తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 232 అర్జీలు నమోదైనట్లు కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ వెల్లడించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
న్యాయం చేయాలంటూ దండం పెట్టి కలెక్టర్‌ను వేడుకుంటున్న అర్జీదారుడు
మీరే చూపండి పరిష్కారం


