ప్రభుత్వ భూమి ఆక్రమించారు
గ్రావెల్ వల్ల ప్రమాదాలు
దారి సౌకర్యం కల్పించడయ్యా..
తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని ఐరాల మండలం గాజులపల్లి దళితవాడకు చెందిన చిట్టెమ్మ, పుష్పమ్మ వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామానికి 1983లో సబ్‌డివిజన్ చేసి దారి కల్పించారన్నారు. రెవెన్యూ అధికారులు సైతం దారి సౌకర్యానికి మార్క్ చేశారన్నారు. అయితే కొందరు అగ్రకులస్తులు దారి సౌకర్యం కల్పించకుండా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. పరిశీలించి న్యాయం చేయాలని వారు కోరారు.
ప్రభుత్వ భూమి ఆక్రమించారని వెల్లడిస్తున్న నునిముద్దలపల్లి గ్రామస్తులు
గ్రావెల్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడిస్తున్న నెప్ట్యూన్ నగర్ వాసులు
తమ గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారని చౌడేపల్లి మండలం నునిముద్దలపల్లికి చెందిన కోటమ్మ, సుబ్రహ్మణ్యం తదితరులు వాపోయారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నంబర్ 996లో ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఆ భూమిని పక్క గ్రామంలోని కొందరు ఆక్రమించుకున్నారని తెలిపారు. పరిశీలించి ఆ భూమిని తమ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం, కమ్యూనిటీ కేంద్రం ఏర్పాటుకు కేటాయించాలని కోరారు.
రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చిత్తూరు నగరంలోని నెప్ట్యూన్ నగర్ వాసులు రమణ, ఆనంద్ తదితరులు తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ కలెక్టరేట్‌కు కూత వేటులో ఉన్న నెప్ట్యూన్ నగర్‌లోని రెండు వీధులకు వెళ్లే దారిలో గ్రావెల్ వ్యర్థాలను వేశారని చెప్పారు. ఆ గ్రావెల్ వ్యర్థాలు ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు పైకి రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. గ్రావెల్ వ్యర్థాలను రోడ్డుకు ఇరువైపులా వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ భూమి ఆక్రమించారు
ప్రభుత్వ భూమి ఆక్రమించారు


