నందినీకి ఏమైనా జరిగితే..! | - | Sakshi
Sakshi News home page

నందినీకి ఏమైనా జరిగితే..!

Nov 2 2025 9:36 AM | Updated on Nov 2 2025 9:36 AM

నందిన

నందినీకి ఏమైనా జరిగితే..!

ఇంజినీరింగ్‌ కళాశాల ఎదుటతల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ధర్నా

తరలివచ్చిన విద్యార్థులు

మెరుగైన వైద్యం అందించాలన్న ట్రైనీ కలెక్టర్‌

లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు రగిలిపోయాయి. అధ్యాపకుల కక్ష సాధింపు వల్ల తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ మేరకు కళాశాల ఎదుట శనివారం ధర్నాకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కళాశాలలో తృతీయ సంవత్సర విద్యార్థిని నందిని గత నెల 31న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. అధ్యాపకులు తీవ్రంగా అవమానించడంతో మానసికంగా కుంగిపోయి చావుకు తెగించిందన్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు మిన్నకుండిపోయిందని ధ్వజమెత్తారు. గతంలో ఎప్పుడూ సెలవు ఇవ్వని యాజమాన్యం శనివారం సెలవు ప్రకటించిందని ఆరోపించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని, వేలూరులోని ఓ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య చికిత్సకు తల్లిదండ్రుల వద్ద చిల్లిగవ్వ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యార్థినికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పోలీసులు, ట్రైనీ కలెక్టర్‌ చర్చలు

నా బిడ్డను బతికించండి

‘కాయకష్టం చేసి బిడ్డను చదివించుకున్నాం. మరో ఏడాది గడిస్తే బిడ్డ ప్రయోజకురాలు అవుతుందని ఆశపడ్డాం. ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. అధ్యాపకులు కక్ష గట్టి మా బిడ్డను పొట్టనబెట్టుకోవాలని చూశారు. ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉంది..’ అంటూ విద్యార్థిని తల్లి దీప్తి కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కుమార్తె నందినిని అధ్యాపకులు బయట తరిమేసి కొట్టడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. వారం రోజులుగా అధ్యాపకులు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తోటి విద్యార్థులే చెబుతున్నారని ఆరోపించారు.

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు నిత్యబాబు, నెట్టికంఠయ్య, శ్రీనివాసులుఽ ధర్నా వద్దకు చేరుకుని తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. అదే విధంగా ట్రైనీ కలెక్టర్‌ నరేంద్రపడాల్‌ కళాశాల వద్దకు విచ్చేసి విద్యార్థిని తల్లితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాలలో ఘటన జరిగిన తర్వాత యాజమాన్యం అంతా తామే చూసుకుంటామని చెప్పి ప్రస్తుతం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని తెలిసిందన్నారు. ప్రిన్సిపల్‌కి కాల్‌ చేసి హెచ్చరించినట్టు పేర్కొన్నారు. విద్యార్థిని కుటుంబీకులకు న్యాయం చేయకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌, చిత్తూరు జిల్లా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ జేఏసీ చైర్మన్‌ సద్దాం, బాధితులకు మద్దతుగా హరీషారెడ్డి, మనోజ్‌రెడ్డి, దినేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సంజయ్‌, ఆసిఫ్‌, జగన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మన్సూర్‌, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

నందినీకి ఏమైనా జరిగితే..! 1
1/3

నందినీకి ఏమైనా జరిగితే..!

నందినీకి ఏమైనా జరిగితే..! 2
2/3

నందినీకి ఏమైనా జరిగితే..!

నందినీకి ఏమైనా జరిగితే..! 3
3/3

నందినీకి ఏమైనా జరిగితే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement