ఆరోగ్య కేంద్రాల సందర్శన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీలోని అర్బన్‌హెల్త్ సెంటర్‌ను శనివారం రాష్ట ఆరోగ్య మందిర్ పోగ్రాం ఆఫీసర్ సుబ్రమణ్యం సందర్శించారు. కేంద్ర బృందం రాకతో ముందస్తుగా అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. మూడు బృందాలుగా ఏర్పాడ్డ అధికారులు వారికి కేటాయించిన రూట్లల్లో పర్యటించారు. ఈ క్రమంలో సుబ్రమణ్యం బృందం చిత్తూరు నగరం, గుడిపాల, యాదమరి, కాణిపాకం తదితర ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లను తనిఖీ చేసింది. అక్కడ లోటు పాట్లను గుర్తించి సరిదిద్దుకునేలా సూచనలు ఇచ్చారు. వ్యాక్సిన్ నిర్వహణ, రికార్డుల పనితీరు, ల్యాబ్ పరీక్ష, వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుతీరుపై వైద్య అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, ఎస్‌ఓ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
గుడిపాల: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని స్టేట్ హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ సుబ్రమణ్యం తెలిపారు. శనివారం వసంతాపురంలోని ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్‌ను ఆయన సందర్శించారు. ఆయనతో పాటు స్టేట్ డబ్లుహెచ్‌ఓ అధికారి నితీష్‌రామ్, డెప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటప్రసాద్, స్టాటిస్టికల్ అధికారి జార్జ్, డాక్టర్ సంధ్య పాల్గొన్నారు.
వంద శాతం
ఉత్తీర్ణత సాధించాలి
ఐరాల: పదో తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు సన్నద్ధం చేయాలని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఇందిర సూచించారు. శనివారం మండలంలోని స్థానిక ఉన్నత పాఠశాల, ఎం.పైపల్లె, కాణిపాకం ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాలు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రుషేంద్రబాబు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రాల సందర్శన


