ఉలిక్కిపడిన మారేడుపల్లి!
– 8లో
పాఠశాల స్థలం కబ్జా!
కార్వేటినగరం మండలంలోని విజయమాంబాపురం గ్రామంలో పాఠశాల స్థలాన్ని కూటమి నేత కబ్జా చేశాడు.
పలమనేరు: గంగవరం మండలంలోని మారేడుపల్లి ఉలిక్కిపడింది. చిత్తూరులో 2015లో జరిగిన కఠారి దంపతుల హత్య కేసులో చింటూతోపాటు మరో నలుగిరికి జిల్లా కేంద్రంలోని తొమ్మిదో అదనపు షెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. వీరిలో మంజునాథ్ ఒకరు. ఇదినిది పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలోని మారేడుపల్లి గ్రామం. అతనికి ఉరిశిక్ష పడిందనే విషయం తెలియగానే గ్రామస్తులు బిత్తరపోయారు. తమ గ్రామానికి సమీపంలోనే నివాసముంటున్న ముని చౌడప్ప కుమారుడు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా..? అంటూ చర్చించుకోవడం కనిపించింది. తాపీ పనులు చేసుకునే మంజునాథ్ చిత్తూరులో చింటూ ఇంటివద్ద గోడ నిర్మాణానికి వెళ్లి అక్కడ అతనితో స్నేహంగా మెలిగేవాడు. ఆపై అతని మనిషిగా మారాడు. కఠారి దంపతుల హత్యలో చింటూతో కలిసి పాల్గొన్నాడు. అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. చెడు సావాలు ఓ మనిషిని చంపేదాకా తీసుకెళ్తాయనేదానికి నిదర్శనమని పట్టణంలో చర్చించుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,539 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,144 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది.


