యువతకు ఆదర్శం వల్లభాయ్ పటేల్
– సమైక్యత పరుగు ప్రారంభించిన
ఎస్పీ తుషార్ డూడి
చిత్తూరు అర్బన్ : స్వాతంత్య్రం అనంతరం దేశానికి మొట్టమొదటి హోం మంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నగరంలో సమైక్యత పరుగును ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రతకు ఎంతో కృషి చేశారన్నారు. విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన పటేల్ జీవితం ఆదర్శకరమన్నారు. బ్రిటీషర్‌లు భారత్‌ను విడిచి వెళ్లాక దేశ రక్షణ, సమగ్రతకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అందుకే ఆయనకు ఉక్కుమనిషి అనే గుర్తింపునిచ్చినట్లు గుర్తుచేశారు. అనంతరం సమైఖ్యతా పరుగు పందెంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అడిషనల్ ఎస్పీలు రాజశేఖర్, శివానందకిషోర్, డీఎస్పీ సాయినాథ్ పాల్గొన్నారు.


