రోగులకు మెరుగైన వైద్యం
బంగారుపాళెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని తుంబకుప్పం పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో వివిధ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సిబ్బంది అందిస్తున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మందులు సరఫరా అవుతున్నాయా.. లేదా అనే విషయంపై మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లోహిత్‌చెంగల్‌రాయన్‌ను ఆడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రజారోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలుసూచనలు, సలహాలు అందించారు. ఎంఎల్‌హెచ్‌పీలు, సీహెచ్‌ఓలు క్షేత్ర స్థాయిలో పేద ప్రజలకు వైద్యసేవలందించాలని ఆదేశించారు. పీహెచ్‌సీ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. పీహెచ్‌సీకి అవసరమైన ఫ్రిజ్, చిన్నపిల్లల ఉష్ణోగ్రతను పెంచడానికి అవసరమైన వామర్ మిషన్, టేబుల్స్, ముందులు పెట్టుకునేందుకు అవసరమైన ర్యాక్‌లు కలెక్టర్ నిధుల ద్వారా అందిస్తామన్నారు. డాక్టర్ సెల్వరాజ్, పాల్గొన్నారు.


