అవినీతిని అరికట్టాలి
తిరుపతి క్రైమ్ : లంచం ఇవ్వడం.. తీసుకోవడం నేరమని పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అంతం చేయాలని ఏసీబీ రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ రావు పేర్కొన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం దేశ సమైక్యతకు పాటుపడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతిని పురస్కరించుకొని అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా 150 మంది విద్యార్థులతో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి లక్ష్మీపురం సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ.. దేశంలో లంచగొండితనాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఏసీబీ అదనపు ఎస్పీ విమల కుమారి, తిరుపతి ఏఎస్పీ రవి మనోహరా చారి, డీఎస్పీలు, సీఐలు సిబ్బంది పాల్గొన్నారు.


