
పీఎఫ్ చెల్లింపులు వేగవంతం చేయండి
చిత్తూరు కార్పొరేషన్ : భవిష్యనిధి రుణాలు (పీఎఫ్), తుది మొత్తాల చెల్లింపులు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని ఎస్టీయూ సంఘం రాష్ట్ర అసొసియేట్ అధ్యక్షులు గంటామోహన్, జిల్లా అధ్యక్షులు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు శుక్రవారం జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడుని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఈవోతో వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చెందిన టీచర్లకు తుది మొత్తాలు చెల్లించడం ఆలస్యమవుతోందని, ఈ జాప్యం వల్ల ఉద్యోగ విరమణ పొందిన టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వాపోయారు. దీనిపై జెడ్పీ సీఈవో స్పందిస్తూ రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే చిత్తూరు జిల్లాలో భవిష్యనిధి ఖాతాల నిర్వహణ మెరుగ్గా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోడె మోహన్‌యాదవ్, నాయకులు లింగమూర్తి, చంద్రన్, నరేంద్ర పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సు నుంచి పడి వృద్ధుడి మృతి
గుడుపల్లె: కుప్పం నుంచి కేజీఎఫ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో నుంచి ఓ వృద్ధుడు పడి శుక్రవారం మృతి చెందాడు. గుడుపల్లె ఎస్‌ఐ శ్రీనివాసులు కథనం.. కుప్పం నుంచి కేజీఎఫ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో బండకొత్తూరు గ్రామానికి చెందిన మునెప్ప(73) స్వగ్రామానికి వెళ్లాడానికి బస్సు ఎక్కాడు. మార్గమధ్యంలోని బండకొత్తూరు స్టాఫ్ వద్ద డ్రైవర్ బస్సును ఆపకుండా కొంచేం దూరం వెళ్లాడు. ఆపై ఎదురుగా వస్తున్న ఆటోను సైడ్ తీశాడు. ఇంతలో మునెప్ప తన స్వగ్రామం వచ్చేసిందని కిందకు దిగే క్రమంలో బస్సు కదిలింది. మునెప్ప బస్సు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.