
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసపు చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబు చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు అందజేశారు.

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు