
కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకం
చిత్తూరు లీగల్ : కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని అవగాహన కల్పిస్తూ బుధవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకమని.. దీన్ని ప్రతి ఒక్క కక్షిదారులు ఉపయోగించుకోవాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 73,020 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,609 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.19 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలకం