
రీ‘కాల్’ చేయొద్దు!
కలెక్టరేట్ వద్ద ఉన్న ప్రధాన గేటుకు ఉన్న గ్రిల్స్ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. సమస్యలు చెప్పుకుందామని వచ్చిన వారి కాళ్లు ఇరుక్కుపోయేలా చేస్తోంది. ఇలాంటిదే మంగళవారం చోటు చేసుకుంది. పెన్షనర్ల సంఘం నాయకులు సమస్యల పరిష్కారం నిమిత్తం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పలు శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లు హాజరయ్యారు. రిటైర్డ్ రీజనల్ ఉపాధి కల్పనా అధికారి సూరి కలెక్టరేట్‌లోనికి వస్తున్న సమయంలో గేటు వద్ద ఉన్న గ్రిల్స్‌లో కాలు ఇరుక్కుపోయింది. చాలాసేపు తన కాలును బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఏమి చేయలేక అర్ధగంటకు పైగా అక్కడే కూర్చొని ఉండి పోయాడు. కాలును బయటకు తీసే ప్రయత్నంలో ఆ పెన్షనర్ నొప్పికి అల్లాడిపోయాడు. తీరా అక్కిమాపక శాఖ సిబ్బది ప్రత్యేక కట్టర్‌తో గ్రిల్ పైపు కట్టచేసి పెన్షనర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా గ్రిల్స్‌ను సరిచేయాలని పలువురు కోరుతున్నారు. – చిత్తూరు కలెక్టరేట్

రీ‘కాల్’ చేయొద్దు!

రీ‘కాల్’ చేయొద్దు!