
కోడలు అరెస్ట్
చౌడేపల్లె: మామపై అతికర్కశంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచి మృతికి కారుకురాలైన కోడలు సరస్వతమ్మను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఆయన కథనం.. చౌడేపల్లె మండలం, అంకుతోటపల్లెకు చెందిన చిన్నప్పరెడ్డి, రాజమ్మపై కుమారుడు మనోహర్‌రెడ్డి ఆస్తి విషయంపై నిత్యం ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో మార్చి 30వ తేదీ ఇంట్లో ఉన్న తండ్రి చిన్నప్పరెడ్డితో ఘర్షణపడ్డాడు. ఈ క్రమంలో తండ్రి కాలు విరిగిపోగా స్థానిక గ్రామస్తులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయమై మార్చి 31న ‘సాక్షి’లో ‘కడుపున పుట్టినోళ్లా... తోడేళ్లా’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై స్పందించిన జిల్లా ఎీస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది శస్త్ర చికిత్స అనంతరం చిన్నప్పరెడ్డిను స్వగ్రామాని తెచ్చారు. మనోవేదనకు గురైన అతను ఏప్రిల్ 21వ తేదీ మృతిచెందాడు. చిన్నప్పరెడ్డి మృతికి కారణమైన కుమారుడు మనోహర్‌రెడ్డి, కోడలు సరస్వతమ్మపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మనోహర్‌రెడ్డిని గత నెల 16న అరెస్ట్ చేయగా.. సరస్వతమ్మను మంగళవారం అదుపులోకి తీసుకుని పుంగనూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.

కోడలు అరెస్ట్