డబ్బు కొట్టు.. జెండా కట్టు..! - | Sakshi
Sakshi News home page

డబ్బు కొట్టు.. జెండా కట్టు..!

Published Tue, Apr 23 2024 8:30 AM

పలమనేరు సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ పట్టించుకుంటున్న పచ్చ కార్యకర్తలు.  - Sakshi

పలమనేరు : పట్టణంలో సోమవారం జరిగిన టీడీపీ అభ్యర్థి అమరనాథ రెడ్డి నామినేషన్‌ సందర్భంగా జనాలకు మద్యం, నగదు పంపకాలు జోరుగా సాగాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, వెంకటేగౌడ నానినేషన్‌ కార్యక్రమానికి 30వేల మంది వరకు హాజరుకావడంవతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. పరువుపోతుందనే భయంతో అమరనాథరెడ్డి సైతం జన సమీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆమేరకు వి.కోట నుంచి బైక్‌లో వచ్చేవారికి రూ.300, పెట్రోలు, బిర్యానీ, మద్యం, బైరెడ్డిపల్లె నుంచి వచ్చేవారికి రూ.150 పెట్రోలు, భోజనం పంచిపెట్టినట్లు ఆయా వాహనాలను జెండా కట్టినట్లు సమాచారం. అలాగే కుప్పం, కర్ణాటక సరిహద్దు గ్రామాలు, మదనపల్లె, పూతలపట్టు నియోజకవర్గాలనుంచి సైతం జనాలను రప్పించారు. వీరికి మాత్రం మనిషికి రూ.400 దాకా పంపిణీ చేసినట్టు తెలిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement