బోయకొండలో రాహుకాల అభిషేకం | Sakshi
Sakshi News home page

బోయకొండలో రాహుకాల అభిషేకం

Published Thu, Apr 18 2024 10:40 AM

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు - Sakshi

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం నిర్వహించారు. అర్చకులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి ఆలయాన్ని మామిడి, వేపాకు, పూలతోరణాలతో సుందరంగా ముస్తాబుచేశారు. 10:30 నుంచి 12 గంటల నడుమ రాహుకాల అభిషేకం జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఉపవాస దీక్షలతో మొక్కులు చెల్లించుకున్నారు . ఉభయదారులకు ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజారెడ్డి చేతుల మీదుగా తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.

పకడ్బందీగా ఎంసీసీ పర్యవేక్షక్షణ

– టీడీపీ ప్రచారంలో పాల్గొన్న

ఉద్యోగికి నోటీసు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ నిబంధనల అమలును ఎంసీసీ బృందం పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. జిల్లా నోడల్‌ అధికారి మురళీకృష్ణ ప్రతి రోజు వస్తున్న ఫిర్యాదులు, పత్రికల్లో ప్రచురితమవుతున్న వార్తలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన టీడీపీ ప్రచారంలో ఉద్యోగి అనే వార్తను పరిగణనలోకి తీసుకున్నారు. విచారణ నిర్వహించి ఆ మేరకు తవణంపల్లె ఎంపీడీఓ కార్యాలయం టైపిస్ట్‌ దేవకుమార్‌కు షోకాజ్‌ నోటీసును జారీచేశారు. 24 గంటల్లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే బంగారుపాళ్యం మండలం తుంబపాళెం జెడ్పీ హైస్కూల్‌ లో నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఆర్‌ఐ విక్రమ్‌ టీడీపీ కార్యకర్తలను పెట్టుకుని పంపిణీ చేసిన క్రీడాపరికరాలను సీజ్‌ చేయించారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement