టీడీపీ బ్యానర్లు తొలగించారు | Sakshi
Sakshi News home page

టీడీపీ బ్యానర్లు తొలగించారు

Published Fri, Apr 12 2024 1:50 AM

పుంగనూరు పశువుల ఆస్పత్రిలో పార్కింగ్‌ చేసిన జనసేన పార్టీ నేతల వాహనాలు  - Sakshi

రెండు రోజుల పాటు

ఈవీఎంల ర్యాండమైజేషన్‌

చిత్తూరు కలెక్టరేట్‌ : ఎన్నికల కసరత్తులో కీలకమైన ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను రెండు రోజుల పాటు పకడ్బందీగా చేపట్టనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలను కలెక్టరేట్‌లోని రెండు గోడౌన్లలో పటిష్ట బందోబస్తు నడుమ భద్రపరిచారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మొదటి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియకు అవసరమైన సిబ్బందిని అధికారులు నియమించారు. పకడ్బందీ బందోబస్తు నడుమ రెండు రోజుల పాటు మొదటి ర్యాండమైజేషన్‌ నిర్వహించి ఈవీఎం యంత్రాలను ఏడు నియోజకవర్గాలకు కేటాయించనున్నారు. ఆ తర్వాత వాటిని అలాగే కలెక్టరేట్‌లోని గోడౌన్‌లలో భద్రపరచడం జరుగుతుందని కలెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు.

నేడు ఇంటర్‌ ఫలితాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలను ఈ నెల 12న రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అధికాలు విడుదల చేయనున్నారని జిల్లా ఇంటర్మీడియట్‌ డివీఈఓ సయ్యద్‌ మౌలా అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల అవుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో మార్చి 1వ తేదీ నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.

సర్టిఫికెట్ల పంపిణీ

నగరి : ఓంశక్తి ఆధ్యాత్మిక సేవా ఉద్యమం ద్వారా టైలరింగ్‌లో శిక్షణ పొందిన మహిళలకు శక్తి ఏఏ అగత్యన్‌ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. గురువారం ఏకాంబరకుప్పం ఓంశక్తి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మేల్‌మరువత్తూరు బంగారు అడిగళార్‌ మనవడు అగత్యన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేయడంతో పాటు, చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగ, పుచ్చకాయలను పంపిణీ చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లతో పాటు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, స్కేల్స్‌ పంపిణీ చేశారు. ఉద్యమ రాష్ట్ర కార్యదర్శి వీటీ భాస్కర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవా ఉద్యమ సభ్యులు టీసీ కృష్ణయ్య, గోవిందస్వామి, పి.మణి, రాజేష్‌ నాయుడు, కమలాకర్‌, షణ్ముఖ రెడ్డి, మోహన్‌, వి.భాస్కర్‌, ఈశ్వర్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పశువుల ఆస్పత్రిలో

జనసేన వాహనాలు

పుంగనూరు: ఉమ్మడి అభ్యర్థుల ప్రచారంలో భాగంగా పుంగనూరు జనసేన నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. గురువారం పట్టణంలోని ఎంబీటీ రోడ్డులో గల పశువుల ఆస్పత్రిలో వాహనాలను పార్కింగ్‌ చేయడం విమర్శలకు దారితీస్తోంది. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఈ నెల 10వ తేదీన సాక్షిలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా టీడీపీ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని వార్త ప్రచురితమైంది. నగరంలోని పుత్తూరుకు వెళ్లేదారిలో రూరల్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ప్రధాన రహదారి పక్కనే టీడీపీ నాయకులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై వార్త ప్రచురించడం జరిగింది. దీనికి స్పందించిన ఎంసీసీ (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అధికారులు గురువారం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు.

టైలరింగ్‌ సర్టిఫికెట్లు అందుకున్న వారితో శక్తి అగత్యన్‌
1/3

టైలరింగ్‌ సర్టిఫికెట్లు అందుకున్న వారితో శక్తి అగత్యన్‌

బ్యానర్లను తొలగించిన అధికారులు
2/3

బ్యానర్లను తొలగించిన అధికారులు

3/3

Advertisement
 

తప్పక చదవండి

Advertisement