మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Published Mon, Nov 20 2023 12:28 AM

మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ మధుబాల  - Sakshi

చిత్తూరు కార్పొరేషన్‌: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ మధుబాల తెలిపారు. ఆదివారం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయం కళాశాలలో దిశచట్టం, మహిళ సాధికారత అంశంపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంటి నిర్వహణతో పాటు బయట విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సీ్త్ర హక్కుల గురించి తెలసుకోవాలన్నారు. గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌ గురించి అవగాహన పెంపొందించుకోవాలని దిశ ఎస్‌ఐ నాగసౌజన్య తెలిపారు. మహిళలు శారీరకంగా కూడ దృఢంగా ఉండాలన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్య విషయాలపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ రోజాప్రియ తెలిపారు. తాను చిన్నతనంలో గ్రంథాలయాలకు వచ్చి పలు రకాల పుస్తకాలను చదివానని చెప్పారు. నిత్య జీవితంలో గ్రంథ పఠనం దినచర్యగా చేసుకోవాలని డీపీఆర్వో పద్మజ తెలిపారు. పుస్తక పఠనంతో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షురాలు విమల అన్నారు. అనంతరం విమల అతిఽథులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శర్మ, గ్రంథాలయాధికారులు లలిత, మధుబాబు, గుణశేఖర్‌, పూర్ణిమ, తులసీకుమార్‌, దేవిబాల, సరస్వతి, శిరీష, లవకుమార్‌, రాజశేఖర్‌, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement