రేపు కొత్త ఆర్డీఓ కార్యాలయం ప్రారంభం | Sakshi
Sakshi News home page

రేపు కొత్త ఆర్డీఓ కార్యాలయం ప్రారంభం

Published Thu, Oct 12 2023 5:16 AM

మాట్లాడుతున్న ఆర్డీఓ రేణుక   
 - Sakshi

చిత్తూరు కలెక్టరేట్‌ : నగరంలో అధునాతన హంగులతో నిర్మించిన నూతన ఆర్డీవో కా ర్యాలయాన్ని ఈనెల 13న ప్రారంభించనున్నట్లు ఆర్డీవో రేణుక వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఇన్‌చార్జి మంత్రి ఉషశ్రీ చరణ్‌, మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, విశిష్ట అతిథులుగా ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు, మేయర్‌ అముద విచ్చేస్తారన్నారు. సభకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధ్యక్షత వహిస్తారని ఆర్డీవో వివరించారు.

Advertisement
Advertisement