ఐదు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర

Today Gold And Silver Price in Hyderabad - Sakshi

బంగారం ధరలు వరుసగా ఐదో రోజు కూడా తగ్గుతూ వచ్చింది. హైదరాబాద్ లో గత ఐదు రోజులుగా 10 గ్రాముల బంగారం ధర దాదాపు వెయ్యి రూపాయలకు పైగా పడిపోయింది. నిన్న ఒక్కరోజే ఎంసీఎస్స్ లో పది గ్రాములు 22క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గితే నేడు రూ.10 తగ్గింది. దీంతో ధర రూ.42,690కి చేరింది. పది గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,570కు చేరుకుంది. నేడు వెండి ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. నిన్న రూ.800 తగ్గి రూ.72,500కు చేరుకుంది. దేశీయంగా డిమాండ్ ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. 

చదవండి:

మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top