సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాల్లో దేశీయ మార్కెట్లు

Published Tue, Dec 19 2023 4:07 PM

Stock Market RallyToday Closing - Sakshi

దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 0.17% పెరిగి 71,437.19 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.16% లాభంతో 21,453.10 పాయింట్ల వద్ద ముగిశాయి. 

సెన్సెక్స్‌ 30 సూచీలో నెస్లే, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాక్‌లు లాభాల్లో ట్రేడయ్యాయి. విప్రో, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, మారుతీ సుజుకి, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌మహీంద్రా స్టాక్‌లు నష్టాల్లోకి జారుకున్నాయి.

మార్కెట్‌లోని కొన్ని అంశాలు

  • వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ వైట్ ఐరిస్ ఇన్వెస్ట్‌మెంట్ అపోలో టైర్స్‌లో 3% ఈక్విటీని బ్లాక్ డీల్ ద్వారా విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 
  • సన్ ఫార్మా.. లిండ్రా థెరప్యూటిక్స్‌లో 16.7% వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.
  • దేవయాని ఇంటర్నేషనల్ 274 కేఎఫ్‌సీ రెస్టారెంట్లను కొనుగోలు చేయడం ద్వారా థాయ్‌లాండ్ క్యూఎస్‌ఆర్‌ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.
  • కేపీఐ గ్రీన్ ఎనర్జీ రూ.1,245 ఫ్లోర్ ప్రైస్‌తో నిధులను సేకరించేందుకు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ)ను ప్రారంభించింది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

Advertisement
 
Advertisement