స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Tue, May 21 2024 9:34 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 22,470కు చేరింది. సెన్సెక్స్‌ 121 పాయింట్లు దిగజారి 73,899 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.6 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 83.66 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.44 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.09 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.65 శాతం పుంజుకుంది.

‘అంతర్జాయతీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. ఇది దేశీయ ఈక్విటీ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎన్నికల సంబంధిత పరిణామాల వార్తలు, కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 22,500 స్థాయిని నిలుకోగలిగితే జీవితకాల గరిష్టాన్ని (22,795) పరీక్షించవచ్చు. అమ్మకాలు నెలకొంటే 22,200 వద్ద మరో కీలక మద్దతు ఉంది’ అని నిపుణులు తెలిపారు.  

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
 
Advertisement