సాక్షి మనీ మంత్ర: ​వరుసలాభాలకు ‍బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: ​వరుసలాభాలకు ‍బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Published Mon, Dec 18 2023 3:58 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాకమార్కెట్లు స్వల్పనష్టాలతో ముగిశాయి. సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడుదొడుకుల మధ్యసారి చివరికి నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 21,418 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 168 పాయింట్లు నష్టపోయి 71,315 వద్ద స్థిరపడింది.

అమెరికా మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అయితే, అక్కడి సూచీలు వరుసగా ఏడో వారం లాభాలు నమోదు చేశాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ప్రధాన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం రూ.9,232.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.3,077.43 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. 

ఈ వారం స్టాక్‌ మార్కెట్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ అధిక కొనుగోళ్ల జోన్‌లో ఉండడమే ఇందుకు కారణమంటున్నారు. పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, వడ్డీరేట్ల తగ్గింపు దిశగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలు, విదేశీ పెట్టుబడిదార్లలో ఉత్సాహం వంటి సానుకూలతల నేపథ్యంలో గతవారం అధిక కొనుగోళ్లు జరిగిన విషయం తెలిసిందే. అందువల్ల స్వల్పకాలంలో స్థిరీకరణకు అవకాశం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, బజాన్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ సుజుకి, టైటాన్‌, టాటా స్టీల్‌ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ స్టాక్‌లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
 
Advertisement